Taxiwaala Release Date on 17th November 2018-అనేక వాయిదాల అనంతరం నవంబర్ 16వ తేదీన పక్కా విడుదల అని ప్రకటించిన విజయ్ దేవరకొండ “టాక్సీవాలా” సినిమా మరోసారి వాయిదా పడింది. అయితే ఈ సారి కేవలం ఒక రోజు మాత్రమే! 16వ తేదీన రావాల్సిన సినిమాను ఒక రోజు ఆలస్యంగా 17వ తేదీన “టాక్సీవాలా”ను విడుదల చేస్తున్నట్లుగా విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించాడు.

“డ్రైవర్ ఒక రోజు ఆలస్యంగా వస్తున్నాడు, కానీ గమ్యస్థానానికి చాలా ఫన్ గా తీసుకెళ్తాడని హామీ ఇస్తున్నాను” అంటూ ఈ సందర్భంగా తనదైన స్టైల్ లో విజయ్ దేవరకొండ ట్వీట్ చేసారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఆడియో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి యూ ట్యూబ్ లో అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ సంగీత సాహిత్య ప్రియులను అలరిస్తోంది.

ఈ వాయిదాకు రవితేజ “అమర్ అక్బర్ అంటోనీ” ఓ కారణమైయుండొచ్చు. 16వ తేదీన ఈ సినిమా విడుదల కానుండడంతో, రెండు సినిమాలకు తగినన్ని ధియేటర్లు దొరకక “టాక్సీవాలా” వెనక్కి తగ్గిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే ఒకరోజు వెనక్కి తగ్గడం వలన రెండు సినిమాలకు లాభమే తప్ప, నష్టమేమి ఉండదనేది ట్రేడ్ పండితుల భావన.