Taxiwaala movie  talkఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా… అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు విడుదల అవుతుంది అనుకున్న తరుణంలో… సిల్వర్ స్క్రీన్ కంటే ముందుగా పైరసీ రూపంలో ఆన్ లైన్ లో అందుబాటులోకి రాగా… ఫైనల్ గా వెండితెరపై “టాక్సీవాలా” ప్రత్యక్షం అయ్యాడు. మరి ప్రేక్షకులు ఎలాంటి అనుభూతులకు లోనయ్యారు? అంటే…

సహజంగా ఇన్ని వాయిదాల తర్వాత సినిమాను మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. ఒక విధంగా చిత్ర యూనిట్ ఇందులో కొంత విజయం సాధించినట్లే చెప్పవచ్చు. సెకండాఫ్ లోని క్లైమాక్స్ కు ముందు వచ్చే పార్ట్ మినహాయిస్తే… విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్లు ‘సినిమా బోర్ లేకుండా ఫన్నీగా సాగిపోతుందన్న’ ఫీల్ ను కలిగించింది.

ముఖ్యంగా విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రజెన్స్ సినిమాను ‘ఒకసారి చూడొచ్చనే’ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ పరిచయం చేసిన ‘హాలీవుడ్’ అనే క్యారెక్టర్ సినిమాకున్న మరో ప్రధాన బలం. ఎండింగ్ కూడా బాగుంటే “టాక్సీవాలా” రైడింగ్ అదిరిపోయేది గానీ, ప్రస్తుతం అయితే అంత స్పీడ్ కు అవకాశం లేకుండా పోయింది.