taxiwaala-movie-maate-vinadhuga-songఈ ఏడాది ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన “గీత గోవిందం” సినిమాలో ‘ఇంకేం ఇంకేం కావాలే… చాల్లే ఇక చాలే…’ అన్న పాట ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాటతో విజయ్ దేవరకొండ – సిడ్ శ్రీరామ్ ల పెయిర్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇపుడు ఇదే కాంబో “టాక్సీవాలా” ప్రమోషన్స్ కు కూడా శ్రీకారం చుట్టింది.

‘మాటే వినదుగా’ అంటూ ప్రారంభించిన ఈ మెలోడీ సాంగ్ వినసొంపుగా ఉంది. ముఖ్యంగా హమ్ చేయడానికి ఈజీగా ఉన్న ఈ పాటకు జాక్స్ బెజోయ్ క్యాచీ ట్యూన్ ను అందించాడు. కృష్ణకాంత్ సాహిత్యం సమకూర్చిన ఈ పాటలో విజయ్ దేవరకొండ క్లాసీ లుక్ లో కనపడుతున్నాడు. ‘టాక్సీవాలా’ బ్లాక్ బస్టర్ గా నిలిస్తే, ఈ పాట కూడా మంచి ఆదరణ పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.