Tata Boeing, joint venture, Aerospace facility, hyderabad, Telangana, Tata Boeing new facility,Manohar Parrikar, KCR, KTR,  తెలంగాణా రాష్ట్రం పారిశ్రామిక రంగంలో దూసుకుపోతోంది. ఇప్పటికే పలు కంపెనీలు తమ యూనిట్లను తెలంగాణలో ప్రారంభించగా, తాజాగా టాటా బోయింగ్ ఏరో స్పేస్ పేరిట భారత పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ చేపడుతున్న కీలక ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. ఆదిభట్ల సెజ్ లో ఈ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారీకర్ భూమి పూజ చేశారు.

పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న తెలంగాణకు పలు ప్రతిష్ఠాత్మక సంస్థలు తరలి వస్తున్నాయని ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. టాటా బోయింగ్ ఏరో స్పేస్ యూనిట్ లో విమానాలు, హెలికాప్టర్ విడిభాగాలు తయారు కానున్నాయి. తొలి విడతగా ఈ ప్రాజెక్టు కోసం టాటా సన్స్ 200 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా ప్రసంగించిన కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ కు ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలుస్తుందని ప్రకటించారు. కేంద్రం నుంచి రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు విందుకు వెళ్లే ముందుగానే కేంద్ర మంత్రి నుంచి సానుకూల ప్రకటన సాధించిన తెలంగాణ సర్కారు విందు తర్వాత మరెంత సత్ఫలితాలు సాధిస్తుందో చూడాలి.