Tarun-Idi-Naa-Love-Story-Movie-Theatrical-TRAILERచాలాకాలం తర్వాత “ఇది నా లవ్ స్టోరీ” సినిమా రూపంలో ‘నువ్వే కావాలి’ ఫేం యంగ్ హీరో తరుణ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఈ సినిమాను ఎలాంటి మొహమాటం లేకుండా ప్రేక్షకులు తిరస్కరించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న తరుణ్ కు మరోసారి నిరాశే ఎదురయ్యింది.

ఈ సినిమా విశిష్టత ఏమిటంటే… బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని చవిచూడడంతో, మూడు రోజులకే డివిడి ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయ్యింది. అయితే ఇది లీకేజ్ లో భాగంగా విడుదలైందో లేక అధికారికంగానో రిలీజ్ చేసారో గానీ, మరీ ఇంత తక్కువ సమయంలో డివిడి రిలీజ్ అయిన సినిమాగా రికార్డును అందుకుంది. పైరసీ ప్రింట్ లు ఎలాగూ ఫస్ట్ డే వస్తున్నందు వలన డివిడిని ఇంత త్వరగా రిలీజ్ చేసారేమో!