Nandamuri Taraka Ratna Latest Health Bulletinసినీ నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బెంగళూరు, నారాయణ హృదయాలయ హాస్పిటల్‌ నిన్న సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తారకరత్నని వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. ఆయనకి ఇంతవరకు ఎక్మోపై చికిత్స అందించవలసిన అవసరం ఏర్పడలేదని మీడియాకి తెలియజేసింది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నామని పేర్కొంది. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పులు వచ్చినా వెంటనే తెలియజేస్తామని పేర్కొంది. కనుక తారకరత్న ప్రైవైసీకి భంగం కలిగించవద్దని ప్రజలని, మీడియాని కోరుతున్నామని నారాయణ హృదయాలయ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

నారా లోకేష్‌ చిత్తూరు జిల్లా, కుప్పం నుంచి ఈ నెల 27న యువగళం పాదయాత్ర ప్రారంభిస్తున్నప్పుడు, ఆయనకి సంఘీభావం తెలిపేందుకు తారకరత్న కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఆరోజు నారా లోకేష్‌తో కలిసి పాదయాత్ర చేసేందుకు వేలాదిగా ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఆ జనసందోహంలో తీవ్ర ఒత్తిడికి గురైన తారకరత్న స్పృహ తప్పిపడిపోయారు. వెంటనే కుప్పం హాస్పిటల్‌కి తరలించి యాంజియో పరీక్షలు నిర్వహించగా ఆయనకి గుండెలో ఎడమవైపు రక్తప్రసరణ జరిగే కవాటాలు 90 శాతంపై మూసుకుపోయాయని, అందువల్లనే ఆయనకి గుండెపోటు వచ్చిందనే విషయం బయటపడింది.

ఆదేరోజు రాత్రి ఆయనని బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. తొలిరోజుతో పోలిస్తే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడిన్నట్లు వైద్యులు తెలిపారు కానీ ఇంకా పరిస్థితి విషమంగానే ఉంది. అత్యుత్తమ వైద్యు బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఆవరమైన చికిత్స అందజేస్తోంది. తారకరత్న త్వరలోనే కోలుకోవాలని అందరూ ప్రార్ధిస్తున్నారు.
Taraka Ratna health bulletin