Taraka-Ratna_Shifting-_To_Benguluruశుక్రవారం కుప్పంలో మొదలైన నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన సినీ నటుడు తారకరత్నకి గుండెపోటు రావడంతో స్థానిక పీఈఎస్ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందించారు. యాంజియో పరీక్షలో తారకరత్న గుండెలో ఎడమవైపు కవాటం 90 శాతం మూసుకుపోయిన్నట్లు గుర్తించడంతో వైద్యులు అత్యవసర చికిత్స చేశారు. తర్వాత హెలికాఫ్టర్‌ లేదా అంబులెన్సులో బెంగళూరులోని హృదయాలయ హాస్పిటల్‌కి తరలించాలని అనుకొన్నారు. కానీ హృదయాలయ వైద్యుల సూచన మేరకు తారకరత్నని అక్కడే ఉంచి వారి పర్యవేక్షణలోనే కుప్పంలోనే వైద్యం అందించారు. నారా లోకేష్‌ మొదటిరోజు పాదయాత్ర ముగియగానే హాస్పిటల్‌కి చేరుకొని తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొన్నారు.

తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, కుమార్తె నిషిక రాత్రి 9.30 గంటలకి కూడా చేరుకొన్న తర్వాత బాలకృష్ణ, ఆమె హృదయాలయ వైద్యులతో మాట్లాడి వారి పర్యవేక్షణలో తారకరత్నని అర్దరాత్రి అంబులెన్సులో బెంగళూరు హృదయాలయ హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు బైపాస్ సర్జరీ చేయడమో లేదా ముందుగా గుండెలో రక్త ప్రసరణ మెరుగు పరచడానికి స్టెంట్స్ వేయవచ్చు.