Taraka Ratna fined by Hyderabad traffic policeహైదరబాద్ లోని సారధి స్టూడియో పరిసర ప్రాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగించనందుకు గానూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 700 రూపాయలు జరిమానా విధించిన విషయం తెలిసిందే. నిబంధనలకు సెలబ్రిటీలు, అధికారులు అతీతులు కారని చాటి చెప్తున్న హైదరాబాద్ పోలీసులు తాజాగా మరో నందమూరి హీరో కారుకు ఫైన్ విధించారు.

హైదరాబాద్ లోని జుబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ప్రయాణిస్తున్న నందమూరి తారకరత్న కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండడం చూసిన పోలీసులు కారును ఆపి, 700 రూపాయలు జరిమానా విధించారు. అలాగే కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ స్టిక్కర్ ను కూడా తొలగించారు. ‘సౌండ్’ పార్టీలకు నిలయంగా ఉండే జుబ్లీహిల్స్ ప్రాంతంలో కార్లకు బ్లాక్ ఫిల్మ్ స్టిక్కరింగ్ తీయలేదన్న సమాచారంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులకు సామాన్య జనాలతో పాటు నందమూరి తారకరత్న కూడా చిక్కారు. మొత్తమ్మీద రూల్స్ విషయంలో హైదరాబాద్ పోలీసులు పాటిస్తున్న విధానాలకు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.