Tanneru Harish Rao Tongue slipఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు, తెలంగాణా రాజకీయాల రూపురేఖలను మార్చేందుకు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ – టిడిపిలు కలిసి పోటీ చేస్తోన్న ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం అంతా ఈజీ కాదన్న విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తరుణంలో టీఆర్ఎస్ నేతలకు చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న వైనం హరీష్ రావు మాటల ద్వారా వ్యక్తం అవుతోంది.

నిత్యం చంద్రబాబుపై విమర్శలు చేస్తోన్న హరీష్ రావు అండ్ కో, ఆ ఫ్లోలో చంద్రబాబు నాయుడుని తెలంగాణా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కూడా చేసేసారు. ‘మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు’ అంటూ ప్రస్తావించిన హరీష్ రావు, అనంతరం తన పొరపాటును సవరించుకుని ‘మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు’ అంటూ సవరించుకున్నారు. కానీ మీడియాలో ఇది రికార్డ్ కావడంతో, నెటిజన్లు, తెలుగు తమ్ముళ్ళు ఈ వీడియోను షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.