Tanneru Harish Rao COVID-19 Positiveదుబ్బాకలో జరిగిన ఉపఎన్నిక ఐపీఎల్ పోరుని తలపించింది. ఈ స్టోరీ ప్రచురించే నాటికీ… నాలుగు ఈవీఎంలు మొరాయించగా మొత్తం కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి బీజేపీ అభ్యర్థి 1470 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. బీజేపీకే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే స్వల్పతేడాతో ఓడిపోయినా ఈ ఉపఎన్నిక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితిలో పెను ప్రకంపనలు సృష్టించింది.

మంత్రి కేటీఆర్ ఇప్పటికే మీడియా ముందుకు వచ్చి ఓటమిని ఒప్పుకున్నారు. పరిశీలకులు ముందు నుండీ దుబ్బాకలో తెరాసకు ఓటమి తప్పకపోవచ్చని చెప్పుకొచ్చారు. అదే అనుమానంతో ప్రతి ఎన్నికకు ముందు పెట్టే కేటీఆర్ ని తప్పించి కేసీఆర్ ఈ ఉపఎన్నిక కోసం మరో మంత్రి కేటీఆర్ ని రంగంలోకి దించారు అని గుసగుసలు వినిపించాయి.

హరీష్ కూడా చాలా రోజులు అక్కడే మకాం వేసి చివరి వరకు పోరాటం చేశారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత… ప్రజలలో ఉన్న మార్పు కోరిక కారణంగా తెరాసకు ఇబ్బంది తప్పలేదు. గత కొన్ని రోజులుగా కేసీఆర్ ఈ ఓటమికి హరీష్ ని బాధ్యతగా చేస్తారని కూడా అంటున్నారు. అదే వంకతో కాబినెట్ విస్తరణ చేసి కుమార్తె కవితని మంత్రివర్గంలోకి తీసుకొస్తారని సమాచారం.

హరీష్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో వ్యతిరేక కాంపెయిన్ మొదలయ్యింది లేదా మొదలుపెట్టించారు. ఒకవేళ కేసీఆర్ అటువంటి ప్రయత్నమే చేస్తే అది మొత్తానికి బెడిసికొట్టవచ్చు. ఏ ఓటమికి బాధ్యత ఇప్పటివరకు అంతా తామే అయ్యి షో నడిపించిన కేసీఆర్ – కేటీఆర్ లదే. అది గ్రహించి దిద్దుబాటు చర్యలు చేపడితే అది వారికే మంచిది.