Tammineni Srinivas as new speaker of andhra pradesh assemblyఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభ స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు వెళ్లి సభాపతిని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టె ఆనవాయితీని ఫాలో అవ్వలేదని ఫీల్ అయ్యింది వైఎస్సార్ కాంగ్రెస్ మీడియా సాక్షి. చంద్రబాబు సభలో కనీస సంప్రదాయాలను, విలువలను పాటించలేదని సాక్షి బాధ పడింది. అయితే సాక్షి సభలో జరిగిన చాలా సంప్రదాయ ఉల్లంఘనలను విస్మరించడం విశేషం.

స్పీకర్ ఎన్నికకు సంబంధించి ప్రతిపక్షానికి తెలిపి, ఆయన నామినేషన్ సందర్భంగా వారిని కూడా ఆహ్వానించడం సంప్రదాయం. ఆయన నామినేషన్ల పేపర్ల మీద ప్రతిపక్ష నాయకులు కూడా సంతకాలు చెయ్యడం ఆనవాయితీ. అసలు ప్రతిపక్షానికి అటువంటి సమాచారమే అందలేదు. ఇది ఇలా ఉండగా సభాధ్యక్షుడు అంటే ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేశాక, ప్రతిపక్ష నేత వద్దకు వెళ్లి కరచాలనం చేసే సంప్రదాయం కూడా ఉంది. గతంలో వైఎస్ ప్రమాణస్వీకారం చేసాకా చంద్రబాబుకు వెళ్లి కరచాలనం చేశారు.

2014 లో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసాకా జగన్ స్థానానికి వెళ్లి కరచాలనం చేశారు. అది కూడా జగన్ పాటించలేదు. సంప్రదాయాలు అన్ని వైపుల నుండీ పాటిస్తే సభ హుందాతననానికే మంచిది. అయితే తనకు కావాల్సింది, వైఎస్సార్ కాంగ్రెస్ కు రాజకీయంగా ఉపయోగపడేది మాత్రమే కనిపిస్తే అది సాక్షికి మంచిది కాదు. పత్రికా విలువలకు అసలు మంచిది కాదు. మరోవైపు రేపు సభలో సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు.