tammineni-sitaram-chandrababu-naidu-controversy--తెలుగుదేశం పార్టీ తలపెట్టిన జన చైతన్య యాత్ర వస్తున్న రెస్పాన్స్ కి ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ఈ యాత్ర సందర్భంగా నిన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ కు చెందిన దొంగలు ఇసుక అమ్మకాల నుంచి అన్నింటిలోనూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శలు చేశారు.

సాక్షాత్తూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా ఇసుక అమ్ముకుంటున్నారని ఆయన విమర్శించారు. దీనిపై అధికార పార్టీ హర్ట్ అయ్యింది. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై ఇటువంటి చవకబారు విమర్శలు చెయ్యడం తగదని చంద్రబాబుకు హితవు పలికారు. అయితే దీనిపై టీడీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి.

“అదే రాజ్యాంగ పదవిలో ఉన్న కోడెల శివప్రసాద్ రావుకి వైఎస్సార్ కాంగ్రెస్ ఏం చేశారు? అర్థరహితమైన విమర్శలతో చివరికి ఆయనని ఆత్మహత్యకు ప్రేరేపించారు. అది పక్కన పెడితే… నేను సభలో ఉన్నంతవరకునే స్పీకర్ ని అంటూ తమ్మినేని బయట చేసే రాజకీయ వ్యాఖ్యల సంగతేంటి?,” అని వారు అంటున్నారు.

“సభలో మామకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు. దానికి మేము కూడా అనుభవించాం అని స్పీకర్ చెప్పడం ఆయన స్థాయికి తగినవా?,” అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉండగా చంద్రబాబు చేసిన ఈ విమర్శలకు తమ్మినేని ఏమని సమాధానం చెబుతారో చూడాలి.