tammineni-sitaram-chandrababu-naidu-controversyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అసలు విషయాలకంటే అనవసరపు రాద్ధాంతం ఎక్కువగా జరుగుతున్నట్టుగా ఉంది. ప్రతిపక్షంపై ఎదురుదాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంపై చర్చ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలను స్పీకర్ తప్పు పట్టారు. చర్చ సందర్భంగా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టారు.

ఈ సందర్భంగా స్పందించిన స్పీకర్.. ఇదేమన్నా ఖవాలి డ్యాన్సా? ఒకరి తర్వాత మరొకరికి అవకాశం ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రతిపక్ష నేత చంద్రబాబు.. చైర్‌లో నుంచి లేచి మరీ స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. మర్యాద కాదు అంటూ స్పీకర్‌నుద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇదే అదను కోసం కాచుకుని ఉన్న అధికారపక్ష సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. చంద్రబాబు పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన పట్ల అనుచితంగా మాట్లాడారంటూ ఫైర్ అయ్యారు. స్పీకర్ చైర్‌ను అవమానించారంటూ స్పీకర్ మండిపడ్డారు. ఇంత సీనియారిటీ ఉండి ఏం లాభం అని ప్రశ్నించారు.

తనపై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తక్షణమే వెనక్కి తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. చంద్రబాబును సభ నుంచి సస్పెండ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ వారు డిమాండ్ చేశారు. అయితే సభలో రోజా చంద్రబాబుని దద్దమ్మా, చేతకాని వాడు అని పిలిచినా, మంత్రి నాని నీ యమ్మా మొగుడా అంటూ వాడినా స్పీకర్ కు తప్పు అనిపించలేదని, చంద్రబాబు వ్యాఖ్యల మీద మాత్రం అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. మొత్తానికి ఈ గందరగోళంలో అసలు సమస్యలపై చర్చ జరగడం లేదు.