Prince_Trailerశివకార్తికేయన్ హీరోగా నేరుగా తెలుగులో నటిస్తున్న చిత్రం ‘ప్రిన్స్’. ఇది బై లింగువల్ అని ప్రారంభంలో చెప్పి శివ కార్తికేయన్ తెలుగు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు.అక్టోబర్ 21 న సినిమా విడుదలవుతుండటంతో ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. శివ కార్తికేయన్ తెలుగు ఎలా మాట్లాడుతాడా అని ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. ట్రైలర్ లో శివ కార్తికేయన్ ఒక్క తెలుగు డైలాగ్ కూడా పలకలేదు. అన్ని తమిళ డైలాగ్స్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ రాకేందుమౌళి తో తెలుగు డబ్బింగ్ చెప్పించారు.

ఈ సినిమా కులాల గొడవలు చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. కులాల మీద జోక్స్ అన్నీ పాత తెలుగు వార పత్రికలలో జోకుల్లా ఉన్నాయి. కెమెరా, మ్యూజిక్ కూడా కొత్తగా లేవు. ఒక పాప్ సాంగ్ చూస్తున్నట్లుంది ట్రైలర్ చూస్తుంటే. రక్తం రంగు మీద జోక్ కొంచెం పరవాలేదనిపిస్తుంది.

ఇక ఈ ట్రైలర్ లో సత్యరాజ్, ఆనందరాజ్ మాత్రమే తెలుగు డైలాగ్స్ మాట్లాడారు. అరె తెలుగు నటులు ఎవ్వరు అంతగా కనిపించలేదు ట్రైలర్లో. హీరోయిన్ ఇంగ్లీష్ అమ్మాయి ఇదొక వెరైటీ అని అనుకుందాం. మిగిలిన సహాయ నటులు కూడా తమిళ వారే ఉండటం విచారకరం. ఇలా సినిమా తీస్తున్నప్పుడు డబ్బింగ్ అని చెప్పొచ్చుగా. జాతి రత్నాలు తీసిన అనుదీప్ కి ఈ సినిమా విజయం ఎంతో అవసరం. రచయితగా అనుదీప్ ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా తో ఒక డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రిన్స్ హిట్ అవ్వకపోతే అనుదీప్ వన్ సినిమా వండర్ గా మిగిలిపోతాడు. ధనుష్ ‘సర్’ సినిమా లో తెలుగులో నేరుగా డైలాగ్స్ చెప్పాడు. బైలింగ్వల్ అని ఈ డబ్బింగ్ తమాషాలేంటి ప్రిన్స్?