tamil-public-talk-on-2-0-movie‘మా’ సినిమా అన్న పదానికి, “మన భారత దేశ” సినిమా అన్న పదానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు బడా సినిమాల జోరులో ఆ తేడా స్పస్తంగా కనిపిస్తుంది. బాహుబలి అనే సినిమా అంత భారీ హిట్ అవ్వడానికి కారణం యావత్ సినిమా ప్రపంచం. అనేక దేశాల్లో, ఎందరో ఆ సినిమాను ఇష్టపడ్డారు కనుక ఆ సినిమా అంత భారీ సక్సెస్ అవగలిగింది. కానీ ఒక్క తెలుగు వారే చూసి ఉంటే సినిమా అంత హిట్ అయ్యి ఉండేదా? అయితే బాహుబలి సినిమాని ఢీ కొట్టి ఎలా అయినా ఆ సినిమాను మించి వసూళ్లు రాబట్టాలీ అని హిందీలో అనేక సినిమాలు వచ్చాయి. పద్మావతి, తాజాగా థగ్స్ ఆఫ్ హిందుస్తాన్. అయితే ఇప్పుడు అదే రిస్క్ ను, అదే పనిని తమిళ సోదరులు చేస్తున్నారు.

సోషియల్ మీడియాలో వినిపిస్తున్న కధనాల ప్రకారం రేపు విడుదల కానున్న ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ “రోబో-2.0″కి భారీగా ఓపెనింగ్స్ అందించి బాహుబలిని మించేలా చెయ్యాలి అన్నది తమిళ తంబీల మనోభావాలకు అర్ధం పడుతుంది. అయితే ఇక్కడ చిన్న విషయం ఒకటి మనం మరచిపోయాం. బాహుబలి రెండు పార్ట్స్ కలిపితే రోబో 2.0 సగం బడ్జెట్ అంత ఉండదు. అలాంటిది బాహుబలితో రోబో 2.0 ని పోల్చి ఆ సినిమాకి ధీటుగా ఓపెనింగ్స్ మరియు కలెక్షన్స్ రాబట్టడం అనే ఆలోచన ఏదైతే ఉందో అది నిజంగా అపహాస్యం అనే చెప్పాలి. పైగా రోబోలో రజనీకాంత్ క్రేజ్ కి బహుబలిలో మన యువ హీరో ప్రభాస్ కి ఎలా పొంతన పెడతారు. ఆయన పెద్ద హీరో, సీనియర్ హీరో, మన ప్రభాస్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ స్థాయికి వెళుతున్న హీరో.

ఇక దేశం దాటి చూసే వారికి ఈ సినిమా ఒక భారత దేశ సినిమా లేదంటే రజనికాంత్ సినిమా, కాదు అంటే చివరకు శంకర్ సినిమా అంటారు తప్పితే ఇది తమిళ సినిమా అని ఎవ్వరూ స్పష్టంగా ప్రస్తావించరు. మరి ఈ క్రమంలో బాహుబలి ని కొట్టాలి, దంగల్ ని ఢీ కొట్టాలి. రోబో తో కొత్త చరిత్ర సృష్టించాలి అని సోషియల్ మీడియాలో వస్తున్న కధనాలు ఆయా వ్యక్తుల అపరిపక్వత, అమాయకత్వం అనే చెప్పాలి. ఇందులో ఇంకో చిన్న విషయం ఏంటి అంటే, ప్రతీ సినిమా వీలైనన్ని వేల కోట్లు కొల్లగొట్టాలి అనే తీస్తారు. అయితే ఆయా పరిస్థ్తితుల బట్టి, ఆయా సినిమాల స్టామినా బట్టి వారు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. మొత్తంగా అదీ ఈ సోషియల్ మీడియా చంటోళ్ల గోల.