జయలలిత అప్ డేట్స్… డాక్టర్లు తేల్చేసారు..!

jayalalithaa-health-updatesతమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం క్రమంగా కుదుట పడుతున్నట్టు, వైద్యం అందిస్తున్న అపోలో ఆస్పత్రి వర్గాలు తేల్చాయి. అయితే పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని తెలిపాయి. “ఎయిమ్స్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందం సీఎంకు చికిత్స అందిస్తోందని, వీరి చికిత్సకు జయలలిత బాగానే స్పందిస్తున్నారని, లండన్ నుంచి వచ్చిన క్రిటికల్ కేర్ స్పెషలిస్టు డాక్టర్ రిచర్డ్ బేల్ గురువారం నాడు జయలలితను మరోమారు పరీక్షించారని” అని అపోలో వర్గాలు పేర్కొన్నాయి.

ముఖ్యమంత్రికి ఉన్న మధుమేహం, వింటర్ బ్రాంకైటిస్‌ ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక వైద్యుల సూచనల మేరకు మెడికల్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ ను రూపొందించినట్టు అపోలో సీఈవో సుబ్బయ్య విశ్వనాథన్ తెలిపారు. ఎయిమ్స్ నుంచి వచ్చిన ఊపిరితిత్తుల నిపుణుడు డాక్టర్ జి.ఖిల్నానీ, అనస్తీషియాలజీ, క్రిటికల్ కేర్ వైద్యుడు డాక్టర్ అంజంత్రికా, కార్డియాలజీ నిపుణుడు డాక్టర్ నితిశ్ నాయక్ జయలలితను పరీక్షించారు. మరో వైపు జయలలిత ఆరోగ్య పరిస్థితిని వెల్లడించాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఆమె ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్స్ విడుదల చేస్తుండడం వల్ల ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని న్యాయస్థానం సూచించింది.

ఇదిలా ఉంటే, జయలలితను చూసేందుకు అపోలో ఆసుపత్రికి వెళ్లిన ఆమె దత్త పుత్రుడు సుధాకరన్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో, దాదాపు గంటన్నర పాటు అక్కడే వేచి చూసి తిరిగి వెళ్లిపోయారు. కాగా, దీనిపై సుధాకరన్ మద్దతుదారులు మండిపడుతూ, జయలలితను చూసేందుకు ఆయన్ని అనుమతించాలని డిమాండ్ చేశారు. మరో పక్క, జయలలిత మేనకోడలిని అంటూ వచ్చిన మహిళ దీపా జయకుమార్ కు కూడా చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. జయమ్మ కోలుకుంటుంటే… వీరిని ఎందుకు చూడనివ్వడం లేదు అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది.



Follow Mirchi9 on Google News

This Week Releases on OTT – Check ‘Rating’ Filter

Hiring Content Writer: We are looking to hire a ‘Telugu’ content writer. Send your sample articles to [email protected]

పుష్ప... 'ఫైర్' అనుకొంటివా... 'ఫ్లవర్..!'Don't Missపుష్ప ట్రైలర్... 'కంటెంట్'లో కన్ఫ్యూషన్..!'ఆర్య, ఆర్య 2' తర్వాత సుకుమార్ - అల్లు అర్జున్ కాంభినేషన్ లో వస్తోన్న "పుష్ప" సినిమాపై సినీ పరిశ్రమలో...Akhanda in Mass theatresDon't Miss'కడప'లో కూడా 'కమ్మ' వాళ్ళే కొంటున్నారా?ఏదైనా ఒక మంచి జరిగినపుడు దానిని ఆహ్వానించాలి గానీ, బురద జల్లే ప్రయత్నం చేయకూడదు. ప్రస్తుతం "అఖండ" సినిమాపై ఓ...'కులం' తలుచుకుంటే 'కలెక్షన్స్' వచ్చేస్తాయా?Don't Miss'కులం' తలుచుకుంటే 'కలెక్షన్స్' వచ్చేస్తాయా?ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోన్న "అఖండ" సినిమాకు కులం ఆపాదించే పనిలో ఓ వర్గం తలమునకలై ఉన్నట్లుగా కనపడుతోంది. 'అఖండ'కు...akhanda Dallas Kammas TicketsDon't MissAkhanda U.S. Record: Crying On Kammas Goes To Next LevelNandamuri Balakrishna's Akhanda has taken a flying start at the box office despite the mixed...Akhanda Review RatingDon't MissAkhanda Review - Lengthy Mass JatharaBOTTOM LINE Lengthy Mass Jathara OUR RATING 2.5/5 CENSOR 2h 47m, 'U/A' Certified. What Is...

Mirchi9