Vetrimaaran - Jr NTR యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఆయన తెలంగాణ పోరాటయోధుడు కొమరం భీంగా కనిపించనున్నాడు. ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. సినిమా వాయిదా పడటంతో ఈ చిత్రం షూటింగ్ జూన్ వరకూ జరగనుందని సమాచారం.

మరోవైపు ఇటీవలే తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఎన్టీఆర్ ని కలిసి ఒక కథ వినిపించాడని సమాచారం. వెట్రిమారన్ ఇటీవలే ధనుష్ తో అసురన్ అనే క్లాసిక్ సినిమా చేశాడు. ఆ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో నారప్ప అనే పేరుతో విక్టరీ వెంకటేష్ హీరోగా నిర్మిస్తున్నారు.

అటువంటి దర్శకుడు ఎన్టీఆర్ కు కథ చెప్పడంతో నందమూరి అభిమానులు చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. అసురన్ లో ధనుష్ వంటి పాత్ర ఎన్టీఆర్ కు పడితే అతని నటవిశ్వరూపం చూడొచ్చని ఆరాటపడుతున్నారు. అయితే ఈ కథకు ఎన్టీఆర్ ఇంకా ఎస్ చెప్పలేదని సమాచారం.

కొంత సమయం తీసుకుని అలోచించి చెబుతా అని ఆ దర్శకుడికి చెప్పినట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ తరువాతి చిత్రం కోసం త్రివిక్రమ్, కొరటాల కూడా ఇప్పటికే రెడీ గా ఉన్నారు. తమిళ దర్శకుడు అట్లీ కూడా ఎన్టీఆర్ కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మరి ఈ చిత్రాల ఆర్డర్ ఎలా ఉండబోతుందో చూడాలి.