Don't-Attach-My-Accident-Pictures---Rajasekharఏంటో ఈ మధ్య అసలు చచ్చిపోవడానికి సరైన కారణలే దొరకడం లేదు. చిన్న చిన్న విషయాలకు, అర్ధం పర్ధం లేని ఆలోచనలతో సింపిల్ గా చచ్చిపోవాలి అనుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఇంతకీ మ్యాటర్ ఏంటో ఇంకా అర్ధం కాలేదు కదా. తమిళ దర్శకుడు ఒకతను మ్యూజిక్ డైరెక్టర్ పాట పాడలేను అన్నాడు అని ఏకంగా నిద్ర మాత్రలు మింగేసి చచ్చిపోదాం అనుకున్నాడట.

అసలు ఇంతకీ ఎవరు ఆ డైరెక్టర్, ఏంటి ఆ కధ అంటే,తమిళంలో క్యారెక్టెర్ ఆర్టిస్ట్ గా మెరిసిన ‘పొన్నుడి’ దర్శకుడిగా మారి ‘సోమపాన రూప సుందరన్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి అబ్బాస్ ర‌ఫీ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక చిత్రంలో ఒక కీలక పాటను అబ్బాస్ ర‌ఫీ తమిళంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుధ్ తో పాడిస్తాను అని చెప్పాడట. అయితే అనిరుధ్ ఈ పాట పాడతాడు అని భారీ ఆశలే పెట్టుకున్న దర్శకుడు అనిరుధ్ బిజీ అంటూ తాను పాడలేను అంటూ చెప్పడంతో నిర్మాతతో వీర లెవెల్ లో డిష్యుమ్..డిష్యుమ్.. చేశాడట. అంతవరకూ ఒక ఎత్తు అయితే సడం గా మోతాదుకు మింది నిద్ర మాత్రలు మింగి ఆత్మ హత్యకు పాల్పడ్డాడట.

ఇదేం వీడూరమో కానీ, ఎవరైనా కుదరదు అంటే వేరే వాళ్ళను చూసుకోవాలి, లేదా బ్రతిమిలాడో, భయపెట్టో, రెమ్యునిరేషన్ విషయంలో మ్యానేజ్ చేసే పాట పాడించుకోవాలి కానీ, ఇలా చచ్చిపోవడానికి సిద్దం అయిపోతారా? ఎక్కడైనా ఉందా ఇది. అయినా ఇలాంటి ఆలోచనలు అన్నీ తమిళ తంబీలకే ఎందుకు వస్తాయో ఏంటో? ఈ న్యూస్ పొరపాటున మన ఆర్జీవీ చూస్తే ఇంకే ఉంది ‘సూసైడ్’ అంటూ ఇదే స్టోరీతో సినిమా తీసినా తీసేస్తాడు. అయితే అదృష్టం ఏంటి అంటే సకాలంలో ఆ దర్శకుడిని హాస్పిటల్ లో చేర్చడంతో బ్రతికి బట్టకట్టాడు లేదంటే, సదరు అనిరుధ్ గారు ఈ దర్శకుడి లాస్ట్ జర్నీకి పడాల్సి వచ్చేది లాస్ట్ పాట.