tamil-director-hari-controversy-with-ntr‘జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలియదంటూ’ తమిళ దర్శకుడు హరి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ గురించి నిజంగా తెలియదా? లేక తెలిసే ఈ వ్యాఖ్యలు చేసారా? అంటే దానికి సమాధానం అందరూ అంచనా వేయొచ్చు. మరి ఎందుకు హరి అలాంటి సమాధానం చెప్పారు? అంటే… అది ఒక చిన్న సైజు రివెంజ్ స్టోరీ అంట!

‘సింగం’ సీక్వెల్స్ తో సంచలనాలు సృష్టించిన హరి, టాలీవుడ్ యంగ్ టైగర్ కు కధ చెప్పాలని సమయం అడుగగా, జూనియర్ ఎన్టీఆర్ అందుకు ‘నో’ చెప్పడంతో హర్ట్ అయిన హరి, మీడియా వర్గాలు అడిగిన ప్రశ్నకు ‘ఆ విధంగా’ సమాధానం చెప్పి రివెంజ్ తీర్చుకున్నాడంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే తనకున్న వ్యక్తిగత పనుల రీత్యా మాత్రమే ‘బుడ్డోడు’ అప్పాయింట్మెంట్ ఇవ్వలేదని టాలీవుడ్ లో జరుగుతున్న ప్రచారం.

ఏది ఏమైనా సక్సెస్ వచ్చిన మరు క్షణం జూనియర్ ను ఏదొక వివాదం చుట్టుముట్టడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఈ సారి ప్రత్యక్షంగా జూనియర్ ఎన్టీఆర్ కారణం కాకపోయినప్పటికీ, తారక్ చుట్టూనే వివాదం చెలరేగడం విశేషం. ఈ వివాదాలన్నీ పక్కన పెట్టాలంటే… తన తదుపరి సినిమాను జూనియర్ ప్రకటించాల్సిందే…! అప్పుడు గానీ ఈ వివాదాల వార్తలు పక్కనవెళ్ళి, తారక్ కొత్త సినిమా కబుర్లపైకి ఫోకస్ వెళ్తుంది..!