Tamil actress luckily escaped bomb attack in sri Lankaశ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళు సంభవించాయి. ఇప్పటి వరకు 166 మంది మృతిచెందినట్లు 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ఈస్టర్‌ సండే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులనే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. మొత్తం ఆరు ప్రాంతాల్లో బాంబులు పేల్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆర్మీ రంగంలోకి దిగి సహాయచర్యలు చేపడుతుంది.

మరోవైపు ఈ పేలుళ్ళ నుండి నటి రాధిక తృటిలో తప్పించుకుంది. పేలుడు సంభవించిన సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్ లో ఆమె బస చేశారు. అయితే పేలుడు సంభవించిన కొద్ది సేపటి క్రితం ఆమె హోటల్ గది ఖాళీ చేశారు. ఈ విషయం ఆమె స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. దీనితో ఇండస్ట్రీలోని ఆమె సహచరులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పేలుడు సంభవించిన సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్ శ్రీ లంక ప్రధానమంత్రి నివాసానికి దగ్గరలో ఉండటం గమనార్హం.

మరోవైపు ఉగ్రదాడితో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. ఉగ్రదాడిపై భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. కొలంబోలోని భారత హైకమిషనర్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. బాంబు పేలుళ్లపై అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీ లంకలో ఎల్టీటీఈ నిర్మూలింపబడ్డాక పూర్తిగా శాంతి నెలకొంది. ఇన్ని సంవత్సరాలలో ఇదే అతి పెద్ద ఉగ్రదాడి దీనితో ఆ దేశం ఒక్క సారిగా ఉలిక్కిపడింది.