sex racket in chennai bustedరిలేషన్ షిప్ డేటింగ్ సర్వీస్ పేరుతో కొన్ని రోజులుగా రెండు నంబర్ల నుంచి వాట్సాప్‌ కు అభ్యంతరకరమైన మెసేజ్‌లు వస్తున్నాయి. డేటింగ్ ఇష్టపడే వారి కోసం ఇది ప్రత్యేకమని, డేటింగ్ చేసేందుకు వీఐపీలు కూడా సిద్ధంగా ఉన్నారని, 30 వేల నుంచి 3 లక్షలు వరకు చెల్లించేందుకు రెడీగా ఉన్నారని మెసేజ్‌లు వస్తున్నాయి. ఇవి అన్నానగర్‌లో నివసించే తమిళ సినీనటి జయలక్ష్మి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు.

జయలక్ష్మి ఇచ్చిన తీగతో డొంక లాగిన పోలీసులకు ఓ భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్ వేదికగా చెన్నైలో జరుగుతోన్న ఈ సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వాట్సాప్ సందేశాలు ఎక్కడి నుంచి వస్తున్నదీ గుర్తించారు. విరుగంబాక్కానికి చెందిన మురుగ పెరుమాన్, కవియరసన్‌‌లే వీటిని పంపుతున్నట్టు నిర్ధారించుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

యువకుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలోని ఫోటోలను, అందులోని వివరాలను చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. అందులో బోలెడంతమంది కోలీవుడ్ మహిళా నటుల ఫొటోలు, వారి ధరలతో సహా ఉన్నాయి. ఆ ఫోటోల్లో ఉన్న ప్రముఖ యువనటితో గడిపేందుకు 40 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఓ కస్టమర్‌కు మెసేజ్ పెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఇలా మొత్తం 70 మంది యువతుల అసభ్య ఫొటోలు, వారి రేట్లతో సహా ఉన్నట్టు పేర్కొన్నారు. వాట్సాప్ చాటింగ్‌లను సేకరించిన పోలీసులు.. ఫోటోలు, రేట్లు ఉన్న ఆల్బమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై వెనుక ఎవరున్నారు? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.