tamannaah item song in sudheer babu movie‘అల్లుడు శీను’ చిత్రంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ సరసన తమన్నా మొదటి ఐటెం సాంగ్‌ చేసిన విషయం తెల్సిందే. మళ్లీ అదే హీరోతో తమన్నా తాజాగా రెండవ ఐటెం సాంగ్‌ను కూడా చేసింది. దాంతో తమన్నాను తమ సినిమాల్లో ఐటెం సాంగ్‌ చేయించేందుకు పలువురు నిర్మాతలు మరియు దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. అదే విధంగా యువ హీరో సుధీర్‌బాబు కూడా తన సినిమాలో తమన్నాను ఐటెం సాంగ్‌ చేయించాలని కోరుకుంటున్నాడు.

ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. తమన్నాతో ఒక్క పాటలో అయినా డాన్స్‌ వేయాలని కోరుకుంటున్నాను, ఆమెతో త్వరలో డాన్స్‌ చేస్తానేమో అంటూ ట్వీట్‌ చేశాడు. తాజాగా ఈయన నటించిన ‘భలే మంచి రోజు’ చిత్రం ట్రైలర్‌ విడుదల అయిన సందర్బంగా తమన్నా అభినందనలు తెలిపింది. దానికి బదులుగా సుధీర్‌బాబు కృతజ్ఞతలు తెలిపి తనకు ఆమెతో డాన్స్‌ చేయాలని ఉంది అంటూ ట్వీట్‌ చేశాడు. మరి సుధీర్‌బాబు ట్వీట్స్‌కు తమన్నా ఎలాంటి స్పందన ఇస్తుంది అనేది చూడాలి.