tamannaah-bhatia-naa-nuvve-nijama-manasa-telugu-song-teaserనందమూరి కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా నటించిన “నా నువ్వే” సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ‘నాన్ బాహుబలి’ రికార్డు సృష్టించి అందర్నీ అవాక్కు చేయగా, తాజాగా ఈ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ గా నిలిచిన ‘నిజమా మనసా’ వీడియో ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఇటీవల విడుదల చేసిన లిరికల్ సాంగ్ ఆకట్టుకోవడంతో, ఆడియో పరంగానే కాక వీడియో పరంగా కూడా విజువల్ ఫీస్ట్ లా ఉంటుందన్న సంకేతాలను ఇవ్వగా, ఈ ప్రోమో దానిని బలపరిచింది. ముఖ్యంగా మిల్కీ బ్యూటీ తమన్నా లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. కళ్యాణ్ రామ్ తో కలిసి చేసిన ఈ రొమాంటిక్ సాంగ్ సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ గా నిలుస్తుందన్న నమ్మకాన్ని ఇచ్చింది.