Tamannaah Chiranjeevi Khaidi No 150, Tamannaah Bhatia Item Song Chiranjeevi Khaidi No 150, Tamannaah Bhatia Item Song Chiranjeevi Khaidi No 150 Movieసోషల్ మెస్సేజ్ తో నిండుకుని ఉన్న మెగాస్టార్ “ఖైదీ నంబర్ 150”లో మెగా అభిమానుల కోసం ఓ ఐటెం సాంగ్ ను పెట్టనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా స్టెప్పులు ఇరగదీసే చిరు, ఐటెం సాంగ్ లలో మరింత చెలరేగిపోతారు. అలాగే, ఇలాంటి ఐటెం సాంగ్ లకు కావాల్సినంత ఊపు తెప్పించగల సంగీత దర్శకుల జాబితాలో దేవిశ్రీప్రసాద్ స్థానం మొదటిది. మరి దేవిశ్రీ – మెగాస్టార్ కాంభినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ‘ఖైదీ నంబర్ 150’ ఐటెం సాంగ్ లో చిరుకు ధీటుగా ఎవరు కనిపించబోతున్నారు? అనే దానికి సమాధానం వచ్చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఇప్పటికే కొన్ని సినిమాలలో ఐటెం సాంగ్స్ లో నర్తించిన మిల్కీ బ్యూటీ తమన్నా ఈ పాటలో మెరవనుందని టాక్. ఈ చిత్ర దర్శకనిర్మాతలైన వినాయక్, రామ్ చరణ్ లకు తమన్నాతో మంచి సాన్నిహిత్యం ఉండడం… మెగాస్టార్ సరసన నటించాలనే తమన్నా తాపత్రయం… కలిపి ఈ అవకాశం మిల్కీ బ్యూటీని వరించిందని తెలుస్తోంది. అంతేకాక, మెగాస్టార్ తో పాటు స్టెప్పులు వేయగల సామర్ధ్యం తన వద్ద ఉందని, ఇటీవల విడుదలైన ‘అభినేత్రి’ టీజర్ ద్వారా తమన్నా చెప్పకనే చెప్పింది. దీంతో చిరంజీవికి సరిజోడు తమన్నానేనని చిత్ర యూనిట్ కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందట.