Tamannaah-Bhatia---Queen-Remake‘బాహుబలి 1’ తర్వాత యువకుల కలలరాణిగా మారిన మిల్కీ బ్యూటీ తమన్నా, చేతిలో ప్రస్తుతం బోలెడు టాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఓ పక్కన సినిమాలతో పాటు మరో పక్కన బ్రాండ్ అంబాసిడర్ గానూ, రిబ్బన్ కటింగ్ వ్యవహారాలలోనూ చురుకుగా పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా ప్రొద్దుటూరును సందర్శించింది.

బి న్యూ అనే మొబైల్ షో రూమ్ నూత బ్రాంచ్ ఓపెన్ చేయడానికి విచ్చేసిన ఈ అందాల బొమ్మను వీక్షించడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించిన తమన్నా, తన తదుపరి చిత్రాల గురించి అభిమానులతో పంచుకుంది. అలాగే అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబు ఇచ్చింది.

‘సైరా’ సినిమాలో తాను ఓ కీలక పాత్ర చేయబోతున్నానని ధృవీకరించిన తమన్నా, త్వరలోనే ‘నా నువ్వే’ సినిమా విడుదల కానుందని చెప్పుకొచ్చింది. అలాగే సందీప్ కిషన్ తో ఓ సినిమా చేస్తున్నానని, ‘ఎఫ్ 2’లో కూడా నటిస్తున్నానని స్పష్టం చేసింది. తనకు మహేష్ అంటే ఇష్టమని, ‘భరత్ అనే నేను’ చూశానని, తనకు నచ్చిందని ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబిచ్చింది.