Tamannaah-Showing-up-At-Right-Timeమిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటివరకు స్టార్ హీరోల సరసన నటించింది. తన తదుపరి చిత్రంలో ప్రామిసింగ్ యంగ్ హీరో సత్యదేవ్ రొమాన్స్ చెయ్యబోతుంది. వీరిద్దరూ జంటగా కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవ్ మాక్ టైల్ సినిమాను తెలుగు లో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు వెలువడింది.

నాగ శేఖర్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా భావన రవి నిర్మాతగా నాగ శేఖర్ స్వీయ నిర్మాణ దర్సకత్వంలో ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని సెప్టెంబర్ మధ్య వారంలో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా దర్శక నిర్మాత నాగ శేఖర్ తెలిపారు.

అలానే ఈ చిత్రానికి హ్యాపెనింగ్ మ్యూజిక్ సెన్సేషన్ స్వరవాణి కీరవాణి వారసుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయబోతున్నారు. ఇకపోతే ఈ మధ్య సత్యదేవ్ 47 డేస్ అనే సినిమా థియేటర్లలో విడుదల కాకుండా డైరెక్టుగా ఆన్ లైన్ లోకి వచ్చింది. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఆయన మరో సినిమా ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య కూడా డైరెక్టుగా ఈరోజు అర్ధరాత్రి నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. అది కూడా ఒక రీమేక్ చిత్రం కావడం విశేషం. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా తో సెన్సషనల్ డెబ్యూ చేసిన వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.