Tamanna Challenge for Samantha?ఆహా వీడియో యొక్క 11th హవర్ తో తన డిజిటల్ అరంగేట్రం చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా తన డిజిటల్ కేరీర్ ను ప్లాప్ తో ఓపెన్ చేసినట్టు అయ్యింది. ఆమెకు మంచి పేరు వచ్చినా ఆ సిరీస్ ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. ఆమె ఇప్పుడు తన రెండవ ప్రాజెక్ట్, నవంబర్ స్టోరీతో రాబోతోంది, ఇది మే 20 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం, డిస్నీ + హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అవ్వనుంది.

వెబ్ సిరీస్ యొక్క ట్రైలర్ ఈరోజు విడుదలయ్యి మంచి రెస్పాన్స్ రాబట్టింది. ఒక దారుణ హత్య కేసులో ఇరుకున్న తన తండ్రి ప్రతిష్టను కాపాడటానికి ప్రయత్నిస్తున్న ఒక కుమార్తె కథ నవంబర్ స్టోరీ. వెబ్ సిరీస్‌ కు ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహించారు. ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో అంచనాలు పెరిగాయి.

ఈ మధ్య తెలుగు హీరోయిన్లు డిజిటల్ వైపు చూస్తున్నారు. పాయల్ రాజపుత్, కాజల్ అగర్వాల్ తమ అదృష్టాన్ని ఇప్పటికే పరీక్షించుకుని భంగపడ్డారు. అయితే సమంత చేస్తున్న ది ఫ్యామిలీ మాన్ 2 పైనే అందరి చూపు ఉంది. ఆ వెబ్ సిరీస్ మొదటి పార్ట్ అతిపెద్ద హిట్. సెకండ్ పార్ట్ లోని సమంత క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా చెబుతున్నారు.

ఆ సిరీస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల అవ్వాల్సి ఉండగా చివరి నిముషంలో వాయిదా పడింది. ఈ వేసవిలోనే విడుదల అవుతుందని సమాచారం. ఒకవేళ నవంబర్ స్టోరీ హిట్ అయితే ఆ లోగానే సమంత కు తమన్నా టార్గెట్ సెట్ చేసినట్టు అవుతుంది.