తమన్నాకు అన్ని రకాలుగా పనైంది

Tamanna-Bhatia-Andhadhun remake

నితిన్ చెయ్యబోతున్న అంధాదున్ తెలుగు రీమేక్ కోసం టబు క్యారెక్టర్ కు మిల్కీ బ్యూటీ తమన్నాను ఫైనల్ చేసింది ఆ చిత్ర బృందం. టబు అదరగొట్టిన పాత్రకు తమన్నా ఏ మాత్రం న్యాయం చెయ్యగలదు అనే అనుమానాలు అందరిలోనూ ఉంది. ఎందుకంటే తమన్నా ఇంతకు ముందు నెగటివ్ పాత్ర చేసింది లేదు. పైగా మాములుగా కూడా తమన్నా పెద్ద నటీ ఏమీ కాదు.

అయితే ఛాలెంజింగ్ పాత్రతో పాటు ఈ సినిమాకు తమన్నాకు బానే కిట్టుబాటు అయ్యిందట. ఈ సినిమాకోసం ఆమెకు కోటిన్నర రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఈ మధ్య కాలంలో ఆమెకు దక్కిన అతిపెద్ద రెమ్యూనరేషన్ అమౌంట్ ఇదే. దానితో అన్ని రకాలుగానూ తమన్నాకు వర్క్ అవుట్ అయినట్టు అయ్యింది.

నితిన్ తన రంగ్ దే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా మొదలుపెడతాడు. నవంబర్ నాటికి షూటింగ్ మొదలవుతుంది. రాధికా ఆప్టే పోషించిన పాత్రకు న‌భా న‌టేష్ ఎంపికైంది.* శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 6గా త‌యార‌య్యే ఈ చిత్రాన్ని ఎన్‌. సుధాక‌ర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తుండ‌గా, ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్పిస్తున్నారు.

మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి హ‌రి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ లో వచ్చిన అతితక్కువ హిట్లలో నితిన్ భీష్మ ఒకటి. దానితో ఈ యువహీరో తన ఇతర ప్రాజెక్టులతో కూడా సక్సెస్ ని కంటిన్యూ చెయ్యాలని అనుకుంటున్నాడు.

What’s streaming on OTT? Consult the experts!

Follow @mirchi9 for more User Comments
Watch: Yash's Daughter Cheating While Gorging Ice CreamDon't MissWatch: Yash's Daughter Cheating While Gorging Ice CreamGetting to watch the videos of doting fathers with their daughters will ever be boring...YS Jagan - Nirmala SitharamanDon't MissPolavaram Project To Remain A Dream Forever?Central Government seems to have taken a flipflop on Polavaram Project. Union Finance Ministry is...Kajal Aggarwal - Gautam KitchluDon't MissHere is When Kajal is Going to Be KitchifiedKajal Agarwal's wedding has been around the corner since the announcement that she is going...Aakaasam Nee Haddhu Ra Trailer Talk Amazon Prime VideoDon't MissTrailer Talk: Revealing It All, A Final Punch From SuriyaThe trailer of Suriya's much anticipated Aakaasam Nee Haddhu Raa is finally out. It is...Pawan Kalyan To Be Tollywood's SaviourDon't MissPawan Kalyan To Be Tollywood's SaviourPowerstar Pawan Kalyan who announced his retirement from films to try his luck in Politics...
Mirchi9