తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ను ప్రసన్నం చేసుకోవడానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అందరికంటే ఒక అడుగు ముందుకు వేశారు. దేశానికి స్వాతంత్య్రం 1947లో వస్తే, తెలంగాణలో బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిందని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

దీనికి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ దీటుగా స్పందించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను కలుపుకుంటే తెలంగాణలో 91 శాతం జనాభా ఉండగా.. కేసీఆర్‌ ప్రభుత్వం లో నలుగురు బీసీ మంత్రులు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీ కలిపి ఏడుగురే ఉన్నా రు. ఇదేనా స్వాతంత్య్రం అని ఆయన ఎద్దేవ చేశారు.

ఇదే సందర్భంలో తలసాని ఏ పార్టీ నుంచి గెలిచారు..ఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు..విలువలు లేని వ్యక్తా మాట్లాడేది అని షబ్బీర్‌ అలీ ఫైర్ అయ్యారు. తాను ఏ పార్టీ నుంచి గెలిచానన్నది ప్రజలకు తెలుసునని తలసాని బదులు చెప్పారు. ఆ గొడవ పెరుగుతుండడంతో కౌన్సిల్ డిప్యూటి చైర్మన్ సభను వాయిదా వేశారు.