Talangana Governor Tamilisai Soundararajanతెలంగాణాలో అధికార పార్టీ తెరాసకు – ప్రతిపక్షములో ఉన్న బీజేపీ పార్టీకి ‘ఉప్పు -నిప్పు’ అన్నంతగా వైరం నడుస్తుంది. ఈ పరస్పర దూషణలతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ హోదాలో ఉన్న తమిళిసై రాజ్యాంగ బద్దంగా తనకు దక్కవలసిన గౌరవం దక్కకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు.

తమిళిసై ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసిన తరువాత ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘వ్యక్తిగా కాకపోయినా ఆ పదవికైనా’..,తెలంగాణ ప్రభుత్వం కనీస గౌరవం. మర్యాద ఇవ్వడంలేదని మీడియా ముఖంగా తన అభిప్రాయాన్ని కుండ బద్దలుకొట్టారు.

ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ…, తానూ తెలంగాణాలో రాజకీయాలు చేయడంలేదని.,ఒక ఫ్రెండ్లీ పర్సన్ గా ప్రభుత్వంతో నడుచుకోవడానికి ఇష్టపడతానని.,ఎటువంటి ఇగోలకు పోకుండా ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలకు తన మద్దతు ఎప్పుడు ఉంటుందని పేర్కొన్నారు.

రాజభవన్ ను తెలంగాణ ప్రభుత్వం చిన్న చూపుచూస్తుందని., అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ ప్రసంగం లేకుండానే సభను కేసీఆర్ ప్రభుత్వం నడిపిందని ఇది రాజ్యంగ విరుద్ధమని కేసీఆర్ తీరుని తప్పుపట్టారు. ప్రభుత్వ ప్రతిపాదనలో కొన్ని అంశాలను తిరస్కరిస్తే రాజభవన్ ను అవమానిస్తారా?అంటూ తెరాస ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం తమతో చర్చలు జరపొచ్చని.,గవర్నరుగా నాకున్న విశేష అధికారాలను ఉపయోగించుకోవాలనుకోవడం లేదని., ప్రస్తుతం రాష్ట్రంలో ఏంజరుగుతుందో ప్రజలందరు గమనిస్తున్నారని.,ఇప్పటికైనా తెరాస ప్రభుత్వం తన పట్టుదలను వీడి రాష్ట్రంలో పరిస్థితులను చ్చక్కదిద్దాలని కోరుకుంటున్నాను అని తమిళిసై తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.