దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝమ్మంది నాదం’ మూవీతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది తాప్సీ. ఫస్ట్ మూవీలోనే తన గ్లామర్‌తో యూత్ మతిని పోగోట్టింది. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసింది. అయితే ఏ సినిమా పెద్దగా గుర్తింపును తీసుకరాలేదు. అదీకాక.. తెలుగులో తాప్సీని చాలా వరకు గ్లామర్ పాత్రలకే పరిమితం చేశారు

అయితే ఆ తరువాత హిందీ సినిమాలలోకి వెళ్లిన తాప్సీ తన పంథా పూర్తిగా మార్చేసింది. విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తీస్తూ సక్సెస్ ట్రాక్ లో దూసుకునిపోతుంది. ఒక సినిమా తో మరో సినిమాకు సంబంధం లేకుండా ముందుకు వెళ్తుంది. దీనితో ఆమెకు దేశవ్యాప్తంగా ఒక సెక్షన్ ఫ్యాన్స్ ఏర్పడ్డారంటే అతిశయోక్తి కాదు. తాప్సీ నటిస్తున్న ఇటువంటి సినిమాలు చూస్తుంటే టాలీవుడ్ ఆమెని సరిగ్గా వాడుకోలేదనే చెప్పుకోవాలి.

ఇది ఇలా ఉండగా తాప్సీ తాజాగా ఒక రీమేక్ చిత్రాన్ని ఓకే చేసింది. రన్ లోలా రన్ అనే జర్మన్ సినిమాలో ఆమె నటిస్తుందని ప్రకటించింది. ఈ సినిమా 1999 లో జెర్మనీ తరపున ఆస్కార్స్ కు వెళ్ళింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తరువాత ఈ సినిమా రీమేక్ జరగబోతుంది. వచ్చే ఏడాది జనవరి 29న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఇది ఇలా ఉండగా… టామ్‌ టైక్వెర్‌ దర్శకత్వం వహించిన రన్ లోలా రన్ చిత్రంలో లోలాగా ఫ్రాంకా పోటేంట్, మన్నీగా మొరిట్జ్ బ్లీబ్ట్రూ నటించారు. పోగొట్టుకున్న డబ్బును కనిపెట్టడంతోపాటు, ప్రియుడిని కాపాడుకోవడం కోసం ఒక మహిళ చేసే పరుగు నేపథ్యంలో ఉంటుంది ఈ సినిమా. హిందీలో ఈ సినిమాను సోనీ పిక్చర్స్ నిర్మిస్తుంది.