Taapsee-Pannu-Badlaఓంకార్ అన్నయ్యకు లైఫ్ ఇచ్చిన సినిమా రాజుగారి గది. ఆ తరువాత నాగార్జునని పెట్టి తీసిన రాజుగారి గది-2 పని అవ్వలేదు. ఇప్పుడు రాజుగారి గది-3 పట్టాలు ఎక్కించాడు ఆయన. మొన్న ఆ మధ్య తమన్నాతో ఓపెనింగ్ కూడా చేశాడు. అయితే తనకు తెలియకుండా కథలో కొన్ని మార్పులు చెయ్యడంతో తమన్నా అలిగిందట. సినిమా నుండి తప్పుకుంది. దీనితో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు తమన్నా స్థానంలో తాప్సిని తీసుకుని రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నందిత శ్వేత, నందిత రాజ్ లాంటి హీరోయిన్లు అనుకున్నప్పటికీ వారు సినిమాకి క్రేజ్ తీసుకుని రాలేరు. దీనితో తాప్సివైపే చూస్తున్నారు చిత్రబృందం. తాప్సి ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు తగ్గించేసుకుంది. బాలీవుడ్ లో బిజీగా ఉంది ఈ తరుణంలో ఆమెను ఇక్కడకు తీసుకునిరావడం అంత తేలికైన విషయం ఏమీ కాదు. అయితే ఓంకార్ ఆ ప్రయత్నాలలోనే ఉన్నాడు. ఈ సినిమా ఓంకార్ కు చాలా కీలకమైనది. దీనితో ఎలాగైనా ఆయన హిట్ చేసుకోవాలి. లేకపోతే ముందుముందు అవకాశాలు కష్టమే.

సొంతంగా సినిమాలు చేసుకున్న వాటిని అమ్ముకోలేని పరిస్థితికు వచ్చేస్తాడు. ఓంకార్ తమ్ముడు అశ్విన్‌ బాబు హీరోగా నటిస్తున్న ఈసినిమాలో ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, హరితేజ, ప్రభాస్‌ శ్రీను, అజయ్‌ ఘోష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓంకార్ స్వీయ నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ చిత్రానికి బుర్రా సాయి మాధవ్ చిత్రానికి డైలాగ్స్ అందిస్తుండ‌గా, చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తొందరలో.