T Harish Raoసోమవారం మంత్రి హరీష్ రావుతో కలిసి సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ చేప పిల్లలు వదిలారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారుల కళ్లలో ఆనందం చూడడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని తెలిపారు. ఇదంతా బానే ఉంది అయితే కోవిడ్ రూల్స్ ని మంత్రిగారు పక్కన పెట్టడమే దారుణం.

కరోనా ని లెక్క చెయ్యకుండా తలసాని పర్యటనల మీద పర్యటనలు చేస్తున్నారు. కనీసం కోవిడ్ రూల్స్ ని ఫాలో అవుతున్నారా అంటే అదీ లేదు. ఎక్కడికైనా మందీ మార్బలంతో గుంపులు గుంపులుగా వెళ్లడం… ఏదో నామ్ కే వాస్తే అన్నట్టు మాస్కుని మెడ చుట్టూ వేలాడేసుకోవడం మంత్రిగారికి సర్వసాధారణం అయిపోయింది.

బహుశా తనకు కరోనా వస్తే తన పలుకుబడితో బెస్టు ట్రీట్మెంట్ పొందగలను అని ఆయనకు ధీమా కావొచ్చు. కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే ఈ మంత్రిగారు ఆ వైరస్ ని మరింత మందికి అంటించవచ్చు… పాపం వారు మంత్రి గారిలాగా కార్పొరేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందలేకపోవచ్చు. వారికి జరగరానిది జరిగితే వారి కుటుంబాలు అన్యాయం అయిపోతాయి.

ఇదేదో మొదటి సారి అనుకుంటే తప్పు… లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండీ మంత్రి గారిది ఇదే తంతు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నందున కనీసం బాధ్యత కలిగి ఉండటం అనేది పెద్ద విషయం కాదు అని ఆయన గుర్తిస్తే ఆయనకు ఆయన చుట్టూ ఉండేవారికీ మంచిది.