sye-raa-trailer-telugu--chiranjeevi-get-upమెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక సినిమా, సైరా ట్రైలర్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ట్రైలర్ మిశ్రమ ఫీలింగ్స్ కలిగించింది అనే చెప్పుకోవాలి. ట్రైలర్ లోని కొన్ని షాట్స్, యాక్షన్ బ్లాక్స్ చూస్తే సినిమాను భారీ స్థాయిలో తీశారు అని ఈజీగా అర్ధం అవుతుంది. విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరాయి.

అదే సమయంలో చిరంజీవి గెట్ అప్ పై గతంలో మనం టీజర్ చూసి అనిపించినట్టుగానే ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది అనే ఫీలింగ్ మళ్ళి అనిపించకమానదు. కొన్ని షాట్స్ లో బాగా ఆడ్ గా అనిపించారు. డైలాగ్స్ పర్లేదు అనిపించినా ఈ సినిమా కథ స్థాయికి సరిపోలేదు అనిపించాయి. ఇంకొంచెం పవర్ ఫుల్ గా ఉంటే దేశభక్తి సినిమా ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది.

రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలు, డైలాగులు లేవనే చెప్పుకోవాలి. సినిమాకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే వేరే భాషల్లో ఆడియన్స్ ను అక్కట్టుకోవడం కోసం పెట్టిన స్టార్స్ ను బాగా ఎలివేట్ చెయ్యడం. ఏదో నామ్ కే వాస్తే గా కాకుండా అందరికీ మంచి క్యారెక్టర్స్ ఇచ్చారనే ఫీలింగ్ ట్రైలర్ ద్వారా కలిపించారు.

ఓవర్ అల్ గా సినిమా ట్రైలర్ ఒకే… పాస్ అయినట్టే అనుకోవచ్చు… ఖచ్చితంగా ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. బహుశా ఆ రేంజ్ లో ఉంటే అంచనాలు అందుకోవడం కష్టం అనుకున్నారేమో. చిత్రం విడుదల మీద ఉన్న డౌట్స్ ను పటాపంచలు చేస్తూ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సినిమా విడుదల అవుతుందని చెప్పేశారు.