sye-raa-teaser-pawan-kalyanమెగా అభిమానుల సమక్షంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ లు ముఖ్య అతిధులుగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎప్పుడూ అనర్గళంగా ప్రసంగించే రామ్ చరణ్, ఈ సారి మాట్లాడడానికి పదాలు వెతుక్కోవడం విశేషం. అయితే చెప్పిన కొంచెంలో కూడా ఫ్యాన్స్ కు పండగ లాంటి న్యూస్ ను అందించారు.

“సైరా” టీజర్ తన వద్దకు దాదాపుగా ఉదయం 10.45 నిముషాలకు రాగా, మొట్టమొదటిగా తాను వాట్సప్ లో బాబాయ్ పవన్ కళ్యాణ్ గారికి పంపించానని చెప్పగానే, అభిమానుల నుండి భారీ స్పందన లభించింది. ఇదేదో మిమ్మల్ని ఉత్సాహపరచడానికి చెప్పట్లేదు, వంద శాతం నిజం, నిజం కాబట్టే చెప్తున్నాను అంటూ ప్రతిస్పందించారు.

11 గంటలకు నేను పంపగా, 11.10 నిముషాలకు నాకు రిప్లై వచ్చిందని, ‘టీజర్ అదిరిపోయింది, సినిమాను ధియేటర్ లో చూడడానికి రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటాను’ అని చెప్పారని మెగా పవర్ స్టార్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ చెప్పారంటూ చెర్రీ చేసిన వ్యాఖ్యలతో ఆడిటోరియంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.