చిరంజీవి కోరిక సగం తీరింది… మిగిలిన సగం తీరుతుందా?

Sye Raa Narasimha Reddy - trailer release at SIIMA in Qatartమెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం, సైరా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల అవుతుంది. రేపు ఒక మేకింగ్ వీడియో విడుదలతో టీం తమ ప్రమోషన్స్ మొదలు పెడుతుంది. తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న ఈ సినిమా ఎప్పటి నుండో చిరంజీవి డ్రీం ప్రాజెక్టు. ఈ సినిమా మొదలుపెట్టిన నాటి నుండీ చిరంజీవికి దీనిని బాహుబలి స్టైల్ లో విడుదల చెయ్యాలని ప్రమోట్ చెయ్యాలని కోరికగా ఉన్నారు.

హిందీలో సినిమాను ప్రమోట్ చెయ్యడానికి గానూ అమితాబ్ బచ్చన్ తో ఒక చిన్న పాత్ర చేశారు. అయినా సినిమాకు పెద్దగా హైప్ రాలేదు. అలాగే చాలా కాలంగా ఈ సినిమాకు హిందీలో బయర్స్ దొరకలేదు. సినిమా విడుదల దగ్గర పడుతున్నా బయర్లు రాకపోవడంతో పూర్తి నిరాశగా ఉన్నారు. ఈ తరుణంలో సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. అమిత్ తడాని, ఫర్హాన్ అక్తర్ ఈ సినిమా హిందీ రైట్స్ ను చేజిక్కించున్నారు. ఫర్హాన్ అక్తర్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని మార్కెట్ చెయ్యబోతున్నారు.

గతంలో వీరిద్దరూ కేజిఫ్ ను హిందీలో ఇలాగే విడుదల చేశారు. దీనితో సినిమాకు అక్కడ మంచి రిలీజ్ వచ్చే అవకాశం ఉంది. సినిమాకు ప్రమోషన్స్ కూడా బాలీవుడ్ లో భారీ గా చెయ్యబోతున్నారు. అయితే బాహుబలి స్థాయిలో కాకపోయినా కనీసం చెప్పుకోదగ్గ స్థాయిలో అక్కడ కూడా ఆడితేనే చిరంజీవి కోరిక పూర్తిగా తీరినట్టు. తొందరలో ముంబై లో ఒక భారీ ఈవెంట్ లో సినిమా హిందీ ట్రైలర్ విడుదల చెయ్యడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తుంది.

Follow @mirchi9 for more User Comments
YSR-Congress-Leaders-Turns-Abusive-With--The-Massive-MandateDon't MissYSR Congress Leaders Turns Abusive With The Massive Mandate?YSR Congress has got the Best Speakers among all the Political Parties. Speakers like Roja,...Sri Reddy & Ram Gopal Varma (RGV) in Talks!Don't MissSri Reddy & RGV in Talks!At a press conference, Sri Reddy revealed that she is in talks with Ram Gopal...What Happens With Vallabhaneni Vamsi Next?Don't MissWhat Happens With Vallabhaneni Vamsi Next?Vallabhaneni Vamsi is likely to continue as an MLA but will not join YSR Congress....Don't MissOn His 32nd Yatra, Daggubati Speaks on Women Going SabarimalaSuresh Babu a well-known name in Telugu cinema world is a hardcore devotee of Sabarimala...Don't MissRakul's Plunging Cleavage Show to Steal HeartsRakul Preet Singh has the stunning body worth drooling over and she makes sure it...
Mirchi9