Sye-Raa-Fake-Collections-Do-They-Serve-Any-Purposeప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న ఆర్థికమాంద్యం తీవ్రత భారత దేశం మీద కూడా ఉంది అంటే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఒప్పుకోవడం లేదు. అబ్బే అదేం లేదు…. మోడీ పాలనలో దేశం వెలిగిపోతుంది అంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి సినిమా గురించి ఒక ఉదాహరణ చెప్పడం విశేషం.

మంత్రి గారు ఈ నెల 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన మూడు సినిమాలు…. వార్, జోకర్, సైరా నరసింహా రెడ్డి తలో 120 కోట్ల వసూళ్లు రాబట్టాయని, ఆర్థికమాంద్యం ఉంటే ఇది సాధ్యం కాదని మీడియా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చారు. మంత్రిగారి లాజిక్ కు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా తమ హీరో సినిమా పేరు కేంద్ర మంత్రి నోట రావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఇది ఇలా ఉండగా సైరా తెలుగులో తప్ప మిగతా భాషలలో విఫలం అయ్యింది. ఆ సినిమా రన్ అక్కడ దాదాపుగా పూర్తి అయిపోయినట్టే. తెలుగులో మాత్రం వారాంతంలో ఇంకా వసూళ్లు రాబడుతుంది.

తెలంగాణాలో దసరా సెలవులు పొడిగించడంతో నైజాంలో మరో వారం పాటు సినిమాకు కొంత వెసులుబాటు ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఆర్టీసి సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం స్కూల్, కాలేజీ బస్సులను కూడా వాడుకోవడంతో సెలవులు పెంచారు. మరోవైపు ఆర్టీసి జేఏసీ ఈ నెల 19న తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది.