Sye Raa Narasimha Reddy -Visual effectsభారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కిస్తూ చిత్రాలను తెరపై ఆవిష్కరిస్తున్న ప్రయత్నాలు చాలానే జరుగుతూ ఉన్నాయి. బాహుబలి మొదలు కొని, నేటి మెగాస్టార్ సైరా వరకూ అన్నీ అవే. అయితే ఈ క్రమంలో బాహుబలి మినహా మిగిలిన సినిమాలు (రిలీజ్ అయినవి) అన్నీబాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా చప్పుడు చెయ్యలేదు.

అంతెందుకు దాదాపుగా 500 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన రజని- శంకర్ రోబో-2 .0 కూడా 80 శాతం విసువల్ ఎఫెక్ట్స్ తో కూడిన సినిమానే, ఇక ఆమీర్ ఖాన్ తగ్స్ ఆఫ్ హిందుస్తాన్, తాజగా వచ్చిన మని కర్ణిక ఇలా అన్నీ విసువల్ ఎఫెక్ట్స్ సినిమాలే. కానీ ఇవేమి ప్రేక్షకులను పెద్ద కట్టి పడెయ్యలేదు.

అయితే ఈ సినిమాల ఫలితాలు చూస్తూ ఉంటే మాత్రం మెగాస్టార్ సైరా సినిమా విషయంలో జాగ్రత్త పడాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగు సినిమాల్లో కల్లానే కాదు, సౌత్ ఇండియా సినిమాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా సైరా…ఈ సినిమా కూడా పూర్తిగా గ్రాఫిక్స్ మయం అనే చెప్పాలి.

అయితే ఇప్పటివరకూ నిలిచిన సినిమాల ఫలితాలు చూసైనా ఈ సినిమా టీమ్ జాగ్రత్త పడుతుందేమో అన్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి. చూద్దాం మరి సైరా టీమ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో.