Sye-Raa-Narasimha-Reddy-trailer launch at LB Stanium in Hyderabadమెగాస్టార్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేరోజు విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ నెల 18న ఎల్బీ స్టేడియంలో భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది చిత్రబృందం. అయితే ఆ వేడుక ఇప్పుడు 22వ తారీఖుకు వాయిదా పడింది.

అయితే ట్రైలర్ మాత్రమే 18న అనగా రేపే విడుదల కానుంది. సోషల్ మీడియాతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కొన్ని థియేటర్లలో ట్రైలర్ సాయంత్రం స్క్రీన్ చేయబోతున్నారట. అభిమానులకు ఉచిత ప్రవేశం లభిస్తుంది. గతంలో బాహుబలి కి కూడా ఇలానే ట్రైలర్ విడుదల చేశారు. కాకపోతే బాహుబలి ట్రైలర్ థియేటర్స్ ప్లాన్ నిర్మాతలు చెయ్యగా సైరాకు మాత్రం ఇది పూర్తిగా కొందరి పంపిణీదారులు నిర్ణయమట. దీనితో విడుదలకు ముందే థియేటర్ల వద్ద మెగా అభిమానుల కోలాహలం మొదలు కాబోతుంది.

సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించింది. తమన్నా కూడా ఈ సినిమాలో నర్తకి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ,కన్నడ భాషల్లో ప్రమోషన్స్ కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నారు. దేశంకోసం పోరాడిన ఒక వీరుడి గాధను దేశవ్యాప్తంగా పరిచయం చెయ్యాలని చిరంజీవి ఆశపడుతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.