సైరా షూటింగును అడ్డుకున్న ముస్లింలు

Sye Raa Narasimha Reddy - shooting stopped by muslims

తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. నయనతార, తమన్నాలు నటీమణులు. సినిమా చిత్రీకరణ బీదర్‌ పట్టణంలో జరుగుతుండగా … స్థానిక ముస్లిం యువకులు అడ్డుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణకు ముస్లిం యువకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో అక్కడి బహుమనీ సుల్తాన్‌ కోట చుట్టుప్రక్కల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనితో షూటింగ్ నిలిచిపోయింది.

సినిమా చిత్రీకరణ బహుమనీ సుల్తాన్‌ కోటలో ముస్లిం ప్రార్థనా స్థలంలో జరుగుతున్నందున ఆ ప్రాంతంలో హిందువులకు చెందిన విగ్రహాలు ఉంచరాదన్న ప్రధాన కారణంతో ముస్లిం యువకులు గుంపుగా వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. షూటింగ్‌ ప్రాంతంలో హిందువులకు చెందిన విగ్రహాలను తొలగించాలని ఆందోళన నిర్వహించారు. చిత్ర బృందానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. చిత్ర యూనిట్ పై కేసు నమోదు చేయాలని బీదర్‌ జిల్లా అధికారి నివాసం ముందు నిరసన తెలిపారు.

దీనితో అధికారులు జోక్యం చేసుకుని ఆ విగ్రహాలు తొలగించారు. చిత్రీకరణకు వేసిన సెట్‌ను తొలగించినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని మొదట ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నారు. ఆ తరవాత వేసవి వైపు దృష్టి మళ్లింది. ఈ సినిమా దసరాకు పోస్టుపోన్ అయ్యిందని అప్పట్లో నిర్మాత రామ్ చరణ్ చెప్పారు. ఇప్పుడు మరి కొన్ని వార్తలు మెగా అభిమానులను కలవరానికి గురి చేస్తున్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం దసరా రిలీజ్ కి తగ్గట్టుగా చిత్రీకరణ జరగడం లేదట. దీనితో ఈ చిత్రం ఏకంగా వచ్చే సంక్రాంతికి వాయిదా పడొచ్చు అని తెలుస్తుంది. ఇదే జరిగితే 2020కి సినిమా వెళ్ళిపోయినట్టే.

What’s streaming on OTT? Consult the experts!

Follow @mirchi9 for more User Comments
Megastar Chiranjeevi Disappoints Allu ArjunDon't MissMegastar Disappoints Allu ArjunStylish Star Allu Arjun bagged a massive hit this year with Ala Vaikuntapurramuloo. As we...drugs narcotics caseDon't Missడ్రగ్స్ కేసు లో మహేష్ సతీమణి పేరు... మీడియా సృష్టా?సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో రోజూ కొత్త పేర్లు వస్తూనే ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్,...drugs narcotics caseDon't MissNews Channel Reports Mahesh Babu's Wife Name in Drugs CaseThe Drugs Case linked to Sushant Singh Rajput's Death is creating tremors in Bollywood. We...Khaali Peeli Pay per viewDon't MissFirst Test Case of Pay Per View Model on OTT To Fail Badly?Ishaan Khatter and Ananya Pandey's Khaali Peeli is the first notable Bollywood film to explore...Prabhas - Singeetham SrinivasDon't MissPrabhas21 Seeks Veteran Director’s GuidancePrabhas21 is a sci-fi movie. It is a genre that is very scarcely explored in...
Mirchi9