Sye Raa Narasimha Reddy - Saahoయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహూ చిత్రం ప్లాప్ దిశగా అడుగులు వేస్తుంది. మొదటి వారాంతంలో టాక్ కంటే బెటర్ గా పెర్ఫర్మ్ చేసినా కనీసం 30% లాస్ తప్పేలా లేదు. సినిమా ఫెయిల్యూర్ కు గల అనేక కారణాలలో ఎక్కువ నిడివి కూడా ఒక కారణం. ఆ సినిమా దాదాపుగా మూడు గంటల నిడివి ఉంది. అయితే ఆ తప్పు తమ సినిమాకు జరగకుండా సైరా టీం జాగ్రత్త పడుతుంది. చిరంజీవి స్వయంగా ఎడిటింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఆ పని స్వయంగా చేస్తున్నారట.

సాహూకు జరిగిన తప్పు సైరాకు జరగకుండా అన్ని చర్యలు చేపడుతున్నారు. సైరా వచ్చే నెల 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా విడుదలకు సిద్ధం అవుతుంది. 1న అమెరికా లో ప్రీమియర్లు ఉంటాయి. అక్టోబర్ 1 మంగళవారం కావడంతో అమెరికాలో సహజంగా ఉండే ఆఫర్లు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఖైదీ నెం 150 ప్రీమియర్లేకే వన్ మిలియన్ డాలర్స్ గ్రాస్ రాబట్టింది. సాహూకి కూడా అది సాధ్యపడలేదు. చిరంజీవి ఏం చేస్తారో చూడాలి. మరోవైపు అమిత్ తడాని, ఫర్హాన్ అక్తర్ ఈ సినిమా హిందీ రైట్స్ ను చేజిక్కించున్నారు.

ఫర్హాన్ అక్తర్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని మార్కెట్ చెయ్యబోతున్నారు. గతంలో వీరిద్దరూ కేజిఫ్ ను హిందీలో ఇలాగే విడుదల చేశారు. దీనితో సినిమాకు అక్కడ మంచి రిలీజ్ వచ్చే అవకాశం ఉంది. సాహూ టాక్ బాగా లేకపోయినా హిందీలో బాగా వసూళ్లు రాబట్టింది. దీనితో సైరా ఓపెనింగ్ ఎలా ఉండబోతుందో… చిరంజీవి కల నెరవేరుతుందో లేదో చూడాలి.