Sye Raa Narasimha Reddy - Chiranjeevi మెగాస్టార్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేరోజు విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ తొందరలో మొదలు పెట్టడానికి సిద్ధం అవుతుంది చిత్రబృందం. ఈ క్రమంలో కర్నూల్ లో ఈ నెల 15న సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరపడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం. ఇప్పటికే చిత్రబృందం దీని అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూల్ లోనే జన్మించడంతో అక్కడే ఈ చిత్ర ఈవెంట్ జరపాలని నిర్మాతలు భావించారు. ఈ ఈవెంట్ కు దేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్లు – అమితాబ్ బచ్చన్, రజినికాంత్లను తీసుకురావాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు. అదే జరిగితే జాతీయ స్థాయిలో ఈ ఈవెంట్ కు పబ్లిసిటీ వచ్చి సినిమాకు కావాల్సిన ప్రమోషన్ వచ్చేసినట్టే. టాలీవుడ్ సినీ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగనట్టుగా దీనిని చెయ్యాలని రామ్ చరణ్ అభిలాషగా ఉందట.

మరోవైపు సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించింది. తమన్నా కూడా ఈ సినిమాలో నర్తకి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ,కన్నడ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు. ఆయా భాషల్లో క్రేజ్ తీసుకువచ్చేందకు ఇప్పటికే ఆయా భాషలకు చెందిన నటీనటులతో సినిమాకు వాయిస్ – ఓవర్ ఇప్పించారంట. తెలుగులో పవన్ కళ్యాణ్, తమిళ లో రజినీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో యశ్, హిందీలో అమితాబ్ బచ్చన్ ‌ఉయ్యాలవాడ గురించి సినిమాలో చెబుతారట.