sye-raa-narasimha-reddy-motion-poster-public-talkకోట్లాది అభిమానుల ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా విడుదలైన మెగా 151వ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న “సైరా నరసింహారెడ్డి” మోషన్ పిక్చర్ అదిరిపోయింది. బ్రిటిష్ జెండా తగలబడుతున్న షాట్ తో మొదలైన ‘సైరా’ మోషన్ పిక్చర్ లో ప్రతి షాట్ కేక పెట్టించేలా ఉంది. చివర్లో అరిచిన ‘సైరా నరసింహారెడ్డి… సై సై రా…’ పలుకులు అభిమానులకు బహుశా ధియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయేమో అనే రీతిలో ఉంది.

ఇప్పటివరకు ఎస్.ఎస్.థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లలో ‘వన్ ఆఫ్ ది బెస్ట్’ మ్యూజిక్ ను ఈ మోషన్ పిక్చర్ కు అందించారని చెప్పవచ్చు. అయితే సినిమాకు మాత్రం ఏఆర్ రెహమాన్ అందించనున్నారు. ఆయన కూడా ఇదే రేంజ్ లో ఇస్తే… బాక్సాఫీస్ వద్ద ఆ లెక్కే వేరు… అని ఖచ్చితంగా చెప్పవచ్చు. గతంలో ‘బ్రూస్ లీ’ సినిమాలో మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చే సమయంలో ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఇప్పటికీ ఫ్యాన్స్ చేత ‘కెవ్వు కేక’ పెట్టిస్తోంది. బహుశా దానిని ఇది రీప్లేస్ చేస్తుందేమో అనిపించేలా అదరగొట్టాడు థమన్.

భారతీయ చిత్ర సీమలో అద్వితీయంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుందన్న నమ్మకాన్ని ఈ చిన్న మోషన్ పిక్చర్ ప్రేక్షకులకు, ట్రేడ్ వర్గాలకు కలిగించింది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడే ఒక్క చిన్న నిరుత్సాహం. ప్రతిష్టాత్మక 150వ సినిమాను ఓ సాదాసీదా కమర్షియల్ సినిమా చేసిన చిరు, నిజంగా ఇదే సినిమాను 150వ చిత్రంగా చేసి ఉంటే, చరిత్రలో చెప్పుకోవడానికి చిరస్థాయిగా నిలిచిపోయి ఉండేది కదా! అనిపించక మానదు. ఈ విషయంలో మెగాస్టార్ తప్పుచేసారేమో అనే రేంజ్ లో ఉంది ఈ 48 సెకన్ల మోషన్ పిక్చర్!