Sye Raa Narasimha Reddy dialogues leakఇంకా సెట్స్ పైకి వెళ్ళకముందే మెగాస్టార్ చిరంజీవి “సైరా నరసింహారెడ్డి” సినిమాను లీకేజ్ వెంటాడుతోంది. ధియేటర్లలో విడుదల కాబోతున్న ఫుల్ సినిమాలే లీకేజ్ బారిన పడి ఆన్ లైన్ లో హల్చల్ చేస్తున్న ఈ రోజులలో, సెట్స్ పైకి కూడా వెళ్ళని సినిమాకు సంబంధించి ఏం లీకేజ్ ఉంటుంది అంటే… మెగాస్టార్ చిరంజీవి చెప్పబోయే పవర్ ఫుల్ డైలాగ్స్ లీక్ అయ్యాయంటూ సోషల్ మీడియాలో హంగామా జరుగుతోంది.

“ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా, నువ్వు భుజం మీద తుపాకీతో వచ్చావ్… అయినా నే చేయి మీసం మీదకి పోయే సరికి నీ బట్టలు తడిసిపోతున్నాయిరా” అన్న డైలాగ్ ‘సైరా’ సినిమాలో చిరు చెప్పేదంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎప్పుడో ఎన్టీఆర్, ఏఎన్నార్ ‘బిసి’ కాలం నాటి డైలాగ్ లా కనపడుతున్న ఇది నిజంగా ఆ ప్రతిష్టాత్మక సినిమాలోనిదేనని ఖచ్చితంగా చెప్పలేం.

ఎందుకంటే… ప్రస్తుతం అభిమానులు చూపిస్తున్న ఉత్సాహం అలా ఉంటోంది మరి! టైటిల్ చెప్తే ఫస్ట్ లుక్ ను, కాస్టింగ్ చెప్తే ఫస్ట్ టీజర్ ను అభిమానులే కట్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు. మరి ఈ తరుణంలో నెట్టింట చక్కర్లు కొడుతోన్న ఈ డైలాగ్, మెగాస్టార్ మెగా మూవీలోనిదేనని చెప్పలేని పరిస్థితి. వినటానికి, అనడానికి పవర్ ఫుల్ గానే ఉంది గానీ, ఇలాంటి డైలాగ్స్ ప్రస్తుతం ‘అవుట్ ఆఫ్ సిలబస్’గా ప్రేక్షకులు మార్చేసారు.