Sye Raa Narasimha Reddy -controversyచారిత్రాత్మక కధతో ఓ సినిమాను తెరకెక్కించాలంటే ‘కత్తి మీద సాము’తో కూడుకున్న పని. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… ఏదొక వివాదం చుట్టుముట్టడం అనేది చారిత్రాత్మక కధలను ఎంచుకున్న సినిమాల విషయంలో రొటీన్ గా జరిగే విషయం. అయితే ఇంకా సెట్స్ పైకి కూడా వెళ్ళకముందే మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా “సైరా నరసింహారెడ్డి”ను వివాదం తగులుకుంది. విశేషం ఏమిటంటే… ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటించిన ఒకే ఒక్క విషయం ‘టైటిల్’ అసలు వివాదానికి కారణం.

“ఊయ్యాలవాడ నరసింహారెడ్డి” జీవితగాధను తెరకెక్కిస్తూ… ఆయన పేరు లేకుండా ‘ఊయ్యాలవాడ’ స్థానంలో ‘సైరా’ అని పెట్టడం ఏంటని, ఆ కుటుంబ వంశస్తులు మీడియాకు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, దీనిపై ఫిర్యాదు చేస్తామని రాయలసీమలో ఇప్పటికీ ఉన్న ఉయ్యాలవాడ వారసులు వ్యాఖ్యానించారు. వెంటనే సినిమా టైటిల్ ను “ఊయ్యాలవాడ నరసింహారెడ్డి”గా మార్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ ఎపిసోడ్ ఎన్ని మలుపులు తిరుగుతుందో!