Sye Raa Narasimha Reddy Censor మెగాస్టార్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేరోజు విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. సోమవారం అంటే ఎల్లుండి సినిమా సెన్సార్ పూర్తి అవుతుందని సమాచారం.

అంటే దాదాపుగా 10 రోజులు ముందుగా సినిమా సెన్సార్ పూర్తి అవుతుంది. సైరా నాలుగు భాషల్లో విడుదల అవుతుంది. ప్రతీ భాషలో అత్యధిక థియేటర్స్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది. దానితో రిలీజ్ ప్లానింగ్ పెర్ఫెక్టుగా ఉండాలని ముందే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు.

దేశంకోసం పోరాడిన ఒక వీరుడి గాధను దేశవ్యాప్తంగా పరిచయం చెయ్యాలని చిరంజీవి ఆశపడుతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. హిందీ లో కూడా సినిమాకు డీసెంట్ బజ్ ఉందని నిర్మాతల అభిప్రాయం. చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్ర చెయ్యడం తమకు కలిసి వస్తుందని చిత్రబృందం ఆశిస్తుంది.

అలాగే సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి సూపర్ స్టార్లతో ట్రైలర్ ని ట్వీట్ చేయించడంతో సినిమాకు నార్త్ లో మంచి బజ్ వచ్చిందని అంటున్నారు. త్వరలోనే చిరంజీవి దేశవ్యాప్తంగా తిరిగి సినిమాను ప్రమోట్ చేస్తారని సమాచారం. దీనికోసం విస్తృత ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం.