Sye Raa Narasimha Reddy - Bollywoodమెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా మొదటి రోజు బాక్స్ ఆఫీసు వద్ద ఇరగదీసింది. చాలా చోట్ల బాహుబలి 2 తరువాతి స్థానంలో ఉంది. సినిమా టాక్ బావుండడంతో దసరా సెలవులు పూర్తి అయ్యే వరకూ సినిమా ధోకా లేదంటున్నారు. మొదటి రోజు దాదాపుగా 52 కోట్ల షేర్ కలెక్టు చెయ్యగా అందులో సింహభాగం తెలుగు నుండే.

హిందీ వెర్షన్ మరీ బొత్తిగా కేవలం కోటిన్నర నెట్ మాత్రమే రాబట్టింది. ఈ ఎమౌంట్ కనీసం థియేటర్ల రెంటల్స్ కు కూడా సరిపోదు. వార్ తో పోటీ వల్ల సినిమాకు బాగా దెబ్బ కొట్టింది. అయితే సినిమా రివ్యూలు బాగా పాజిటివ్ గా ఉండడంతో వారాంతంలో సినిమా పుంజుకుంటుందని నిర్మాతల అంచనా. గతంలో కేజీఎఫ్ కూడా ఇలాగే స్లోగా మొదలయ్యి బాగా పుంజుకుంటుందని వారి ధీమా.

తమిళ, మలయాళీ వెర్షన్లు కూడా మొదటి రోజు పెద్ద గొప్పగా లేవు. అయితే ఆయా ఇండస్ట్రీల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అక్కడి సూపర్ స్టార్లతో నటింపచేసినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. విడుదలకు ముందు సైరా 200 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. అన్ని భాషలలో కలిపి 200 కోట్లు షేర్ రాబడితేనే సినిమా హిట్ గా పరిగణించవచ్చు.

టాక్ బావుండడంతో మెగా ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ నెల 13 వరకూ దసరా సెలవులు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు భారీగా ఉంటాయని భావిస్తున్నారు. చిరంజీవి కమ్ బ్యాక్ చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు రాబట్టింది. ఇప్పుడు దానికి రెండింతలు రాబట్టాల్సి ఉంది.