Sye-Raaమెగాస్టార్ చిరంజీవి మొదటి హిస్టారికల్ సినిమా సైరా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో అమెరికా నుండి అమలాపురం వరకు హడావిడి భారీగా ఉంది. అయితే సైరా సినిమా చూడటం ఆరుగురు ఎసైల ఉద్యోగాలకే ఎసరు పెట్టిందట. ఈ ఘటన కర్నూలు జిల్లా కోవెల కుంట్లలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే…. ఆరుగురు ఎసైలు ఈరోజు విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాకు వెళ్లారట. అది కూడా తెల్లవారుజాము షో లకు వెళ్లారట. వారి కోసం ఎందుకో ప్రయత్నించిన ఎస్పి కి వారు దొరకలేదట. విధులలో ఉండి తమకు సమచారం ఇవ్వకుండా సినిమాకు ఎలా వెళతారని, జిల్లా ఎస్పి పకీరప్ప వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారట.

అంతటితో ఆగకుండా వారిని వి.ఆర్.కు బదిలీ చేశారట. ఇప్పుడు ఈ వార్త స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఇది ఇలా ఉండగా సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైరా థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. సైరా 200 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. అన్ని భాషలలో కలిపి 200 కోట్లు షేర్ రాబడితేనే సినిమా హిట్ గా పరిగణించవచ్చు.

టాక్ బావుండడంతో మెగా ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. చిరంజీవి కమ్ బ్యాక్ చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు రాబట్టింది. ఇప్పుడు దానికి రెండింతలు రాబట్టాల్సి ఉంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథతో సినిమా చెయ్యాలని చిరంజీవి ఎప్పటి నుండో అనుకుంటున్నారు ఆ కోరిక ఇప్పటికి తీరింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో ఆయన ఆనందం రెటింపు అవుతుంది.