Maharshi - Sye Raa Narasimha Reddyప్రస్తుతం సెట్స్ పైన ఉన్న చిన్న, పెద్ద సినిమాలన్నీ ‘దీపావళి శుభాకాంక్షలు’ను తెలుపుతూ సినీ అభిమానుల కోసం ప్రత్యేకమైన పోస్టర్లను రిలీజ్ చేసాయి, రెండు సినిమాలు తప్ప! అవే చిరు సైరా… మహేష్ మహర్షి…! విశేషం ఏమిటంటే… ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది సమ్మర్ ను టార్గెట్ చేస్తూ విడుదలకు ముస్తాబవుతున్నవే!

దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. కానీ దాని ఇంపాక్ట్ సాధారణంగా ఉంటే మొత్తానికే బెడిసికొట్టే అవకాశం ఉంటుంది గనుక, ఈ రెండు యూనిట్స్ కూడా గమ్మున ఉండిపోయినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 200 కోట్లతో “సైరా” భారీ ప్రాజెక్ట్ గా నిలువగా, మహేష్ కెరీర్ లో 25వ సినిమాగా “మహర్షి” ప్రత్యేకతను సొంతం చేసుకుంది.