Allu-Arjunమెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న “సైరా” సినిమాకు సంబంధించిన ఓ వార్త మెగా ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో మెగా డాటర్ నిహారిక ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, ఇంతటి ప్రతిష్టాత్మక సినిమాలో ఏదొక సీన్ లో ఖచ్చితంగా రామ్ చరణ్ కూడా కన్నులవిందు చేస్తారని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఇదిలా ఉంటే… తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఓ రోల్ చేస్తున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి స్టార్స్ తో నిండిపోయిన ‘సైరా’కు అదనపు ఆకర్షణగా బన్నీ నిలవనున్నాడని అభిమానులంతా సంతోషిస్తున్నారు. కానీ దీనిని అధికారికంగా వెల్లడించే వరకు నమ్మలేం.

ఎందుకంటే… గతంలో ఇలాంటి సమాచారాలు కుప్పలు తెప్పలుగా సందడి చేసాయి. ప్రతిష్టాత్మక సినిమాలపై ఉన్న క్రేజ్ తో ఇలాంటి సమాచారం పుట్టుకురావడం సహజమే గానీ, ‘రుద్రమదేవి’లో గోనగన్నారెడ్డి ద్వారా మెప్పించిన బన్నీ, ఈ సినిమాలో ఎలాంటి రోల్ కైనా సరిపోతాడని మెగా అభిమానులు గట్టిగా విశ్వసిస్తున్నారు.